Kumbh stampede: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది వరకు భక్తులు మరణించారు. 60 మంది వరకు గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరుగైన నిర్వహణ విధానాలను కోరుతూ పిటిషనర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ రోజు పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది దురదృష్టకరమైన సంఘటన, ఆందోళన కలిగించే విషయం, కానీ మీరు దీనిపై హైకోర్టుని ఆశ్రయించండి.…