CM Chandrababu: పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పలువురికి ఆర్థిక సాయం నిధులు చేశారు. అనంతరం నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై పూర్తి అప్రమత్తతో ఉన్నామన్నారు.
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. కడపలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మిగిలిన నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతంలో కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా…