పాపులర్ రియాలిటీ గేమ్ షో “బిగ్ బాస్ తెలుగు 5” 100 రోజుల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తర్వాత నిన్న గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో వీజే సన్నీ టైటిల్‌ను కైవసం కైవసం చేసుకున్నాడు. ఉద్వేగభరిత, ఉత్కంఠభరితమైన క్షణాల మధ్య హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ రెండో స్థానంలో నిలవగా, మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర ఈ సీజన్‌లో సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. నటులు సిరి హనుమంత్, మానస్‌లు మరో ఇద్దరు ఫైనలిస్టులుగా ఉన్నారు. కొన్ని వారాల క్రితం షోలో తన తల్లికి చేసిన వాగ్దానాన్ని రాచరికంగా నెరవేర్చిన తీరుతో పాటు సన్నీ అభిమానులు తమ మచ్చాకి తగిన విజయం సాధించడంతో ఎంతగానో సంతోషిస్తాన్నారు. ఇక సన్నీ ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Read Also : బిగ్ బాస్ స్టేజిపై బ్రాండ్ అంబాసిడర్ గా అడుగుపెట్టిన నాగ చైతన్య
శ్రీరామ చంద్ర, సన్నీ, సిరి, షణ్ముఖ్ మరియు మానస్ గ్రాండ్ ఫినాలేలో టాప్ 5లో ఉన్నారు. వీక్ గ్రాండ్ ఫినాలేకి 13 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయని టీవీ షో హోస్ట్ నాగార్జున అక్కినేని ధృవీకరించారు. గత నాలుగు సీజన్‌లలోనూ ఈ టీవీ షోలో మహిళా విజేత లేరు. ఈ ఐదో సీజన్‌కి కూడా ప్రేక్షకులు వీజే సన్నీని విజేతగా ఎంచుకున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో 19 మంది సభ్యులతో ఐదో సీజన్ ప్రారంభమైంది. సరయు, ఉమా దేవి, లహరి శేరి, శ్వేతా వర్మ, ప్రియా, ప్రియాంక సింగ్, నటరాజ్ మాస్టర్, హమీద, విశ్వ, రవి, లోబో, అనీ, జెస్సీ, ఆర్జే కాజల్, సన్నీ, షణ్ముఖ్, సిరి, సన్నీ, శ్రీరామ చంద్ర కంటెస్టెంట్స్ గా హౌజ్ లోకి అడుగు పెట్టారు. ఇక గ్రాండ్ ఫినాలేలో రాజమౌళి, సుకుమార్, నాగ చైతన్య, నాని, కృతి శెట్టి, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రష్మిక మందన్న వంటి చాలా మంది స్టార్స్ పాల్గొన్నారు.