Congress : కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ గాంధీ భవన్ లోని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు బుధవారం నిరసన చేపట్టారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో మహిళా నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీకి అండగా నిలిచిన మహిళా నేతలకు గౌరవం లేకుండా, పదవులు, ప్రభుత్వం, కార్పొరేషన్ లలో ఉన్నతస్థానాలు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ బంధువులకే…
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్నిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేత, లోక్ సభ లో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ.. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ మాటలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతా రావు స్పందించారు. ఒకరు తప్పు చేస్తే వేరొకరు క్షమాపనలు చెప్పాలా అంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. సోనియా గాంధీ…
తెలంగాణలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మండి పడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందని, దానికితోడు మళ్ళీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రయాణికుల నడ్డి విరుస్తోందని మండి పడ్డారు. ఆర్టీసీ ఛార్జీలు మళ్ళీ పెంచితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎవరికి ఇష్టమొచ్చినట్టు…
ప్రమాదకర పరిస్థితుల్లో పాఠశాలను ప్రారంభించ వద్దంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకురాలు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో 20 మంది బృందం మంత్రి నివాసానికి చేరుకొని మంత్రి అందుబాటులో లేకపోవడంతో నివాసం వద్ద బైఠాయించారు. మంత్రి వచ్చేవరకు కదిలేది లేదంటూ నివాసం వద్ద బైఠాయించారు. ఎంపీ సంతోష్ కుమార్ కు లబ్ధి చేకూర్చేందుకే పిల్లల ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాలలను ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులకు పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు పాఠశాలలను…