ఇది పరీక్షల కాలం. తెలంగాణలో రెండురోజుల క్రితమే ఇంటర్ పరీక్షలు ముగిశాయి. తాజాగా రేపటి నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జూన్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. రెండేళ్ల తర్వాత జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ప్రతి రోజూ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష వుంటుంది. ఐదు లక్షల 9వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2861…
ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు…
మండే వేసవి ఎన్నో ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏదో ఒకటి తాగాలని అనిపిస్తుంది. వేసవిలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిదికాదు. ఏం తాగినా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. శరీరంలోని నీరు మొత్తం చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. డీ హైడ్రేషన్ సమస్య వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతాం. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. అదే విధంగా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. వేసవిలో బార్లీ…
కిచెన్లో ఉల్లిపాయలు, టమోటా లేకుంటే రోజు గడవదు. ఉల్లిపాయలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. కిలో 20 రూపాయల లోపే లభిస్తున్నాయి. ఇక నిత్యం కూరల్లో వాడే టమోటా ధర మాత్రం ఆకాశానికి చేరింది. అక్కడినించి దిగనంటోంది. తిరుపతిలో మరింతగా పెరిగింది టమోటా ధర. మదనపల్లె మార్కెట్లో రూ.70కి చేరింది కేజీ టమోటా ధర. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వినియోగదారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు టమోటాల వినియోగం ఎక్కువగా వుంటుంది.…
అసలే ఎండలతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కరీంనగర్ నగర వాసులకు నీటి కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. నగరంలోని అనేక డివిజన్ లలో ప్రజలు నీటి అవసరాలు తీర్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు.పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ శివారు గ్రామాలు తాగునీటి సమస్యతో సతమతం అవుతున్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించడం లేదనే కారణంతో మిషన్ భగీరథ పనులను గుత్తేదారులు నత్తనడకన చేపట్టడంతో జనాలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. శివారు గ్రామాలను నగరపాలక…
వేసవి వచ్చేసింది. మండే ఎండలకు తోడు నీటి కొరత జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో…గుక్కెడు నీటి కోసం జనం అలాడిపోతున్నారు. తాగునీటి సరఫరాలో నీటివనరులు, లేదా సాంకేతిక సమస్యలు ఉంటే ట్యాంకర్లతో అయినా సరఫరా చేస్తారు. ఈ నియోజకర్గంలో ఆధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తాగునీరు సరఫరా కాకపోవడంతో క్యాను నీటికి 15 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఆలూరు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ…
ఒకవైపు కోళ్ల దాణా ధరలు ఆకాశాన్నంటుతుండగా మరో వైపు కోడిగుడ్ల ధర మాత్రం రోజురోజుకు పడిపోతున్నాయి.ఇంకోవైపు ఎండలు వేడిమి తట్టుకోలేక కోళ్లు మృతి చెందుతుండడంతో కోళ్ల ఫారాల యజమానులు నష్టాల ఊబిలో పడుతున్నారు.. పది సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కోళ్ల పరిశ్రమ నష్టాల బాటలో నడుస్తుండడంతో పౌల్ట్రీ రైతులు తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.. ఒక్కసారిగా పెరిగిన దాణా రేట్లతో సతమతమవుతున్న కోళ్ల రైతుకు గోరుచుట్టుపై రోకలిపోటులా గిట్టు బాటుకాని విధంగా గుడ్డు ధర ఉండడంతో పరిశ్రమ…
తెలంగాణలో సూరీడు చుర్రుమంటున్నాడు. సాధారణంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండ వేడిమి పెరుగుతుంది. కానీ ఈసారి ఒక నెలముందుగానే ఎండలు పెరిగిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా కెరమెరిలో 43.9 గా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాంకిడిలో 43.8 గా నమోదు అయ్యాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా…
గతంతో పోలిస్తే ఎండాకాలం చుర్రుమనిపిస్తోంది. సమ్మర్ ఎఫెక్ట్ తో తెలంగాణలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో మండుతున్న ఎండలతో ప్రాణాలు పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రం లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు కావడం విశేషం. ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందంటే ఎండల తీవ్రత ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. వడదెబ్బకు గురై మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు…