అసలే ఎండాకాలం. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా విశాఖలోని సింహగిరి తోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎగిసి పడుతున్న మంటలతో ఆ ప్రాంతంలో దట్టమయిన పొగ ఏర్పడింది. గంట నుండి చెలరేగుతున్నాయి మంటలు. ఒక ఫైర్ ఇంజిన్ తో అదుపుచేస్తున్నారు అధికారులు. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సింహాద్రి అప్పన్న కొండల్లో కార్చిచ్చు ఏర్పడింది. తోటల్లో మధ్యాహ్నం 3 గంటల సమయం లో అప్పన్న మైక్రోవేవ్ టవర్ వద్ద ఫలసాయం తోటల్లో భారీగా మంటలు చెలరేగడంతో సింహగిరిపై ఉన్న గిరిజనులు,రైతులు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నించారు.
Read Also: Relationship : మూడు రోజులు అక్కడ.. మరో మూడు రోజులు ఇక్కడ.. భలే లక్కీ ఛాన్స్ గురు నీది..
అయితే మంటలు 3 గంటలుగా అదుపులోకి రాకపోవడంతో ఫైర్ ఇంజిన్ కి సమాచారం అందించడంతో ఒక ఫైర్ ఇంజిన్ సింహగిరిపై చేరుకొంది.. మంటలను ఒక ప్రాంతంలో అదుపు చేస్తూ ఉండగా మరో ప్రాంతంలో కార్చిచ్చు గాలులకు రాజుకోవడంతో మంటలను అదుపుచేయడానికి అధికారులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. పొగ వ్యాపించడంతో అక్కడి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Game On: ‘రిచో రిచ్’ సాంగ్ కు గుడ్ రెస్పాన్స్!