స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సెర్బియాలో ఉన్నాడు. రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్లతో అల్లు అర్జున్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇటీవల “పుష్ప” హిట్ ఇచ్చిన కిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు బన్నీ. ఇక “పుష్ప 2″ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా “పుష్ప : ది…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించడం విశేషం. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్…
టాలీవుడ్లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ఆయన దర్శకత్వంలో నటించాలని అగ్ర హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఇటీవల సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-1 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన పుష్ప-2 సినిమా ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ యాడ్ ఫిలింకు దర్శకత్వం వహించారు. శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ప్రకటనను తెరకెక్కించారు.…
SDT15 ప్రారంభమైంది. ఎట్టకేలకు మెగా అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగానే సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తరువాత తాజాగా సెట్స్ లోకి వచ్చాడు. “రిపబ్లిక్” సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు, అంటే గత సంవత్సరం సెప్టెంబర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కోలుకొని తన తదుపరి చిత్రం కోసం షూటింగ్ ప్రారంభించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై BVSN ప్రసాద్, సుకుమార్…
Pushpa 2 సినిమా షూటింగ్ కు సన్నాహాలు మొదలయ్యాయి. డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే, సామ్ సాంగ్ సినిమాకు ప్రధాన హైలెట్ అయ్యింది. సినిమాలోని స్పెషల్ సాంగ్ “ఊ అంటావా మావా” అంటూ ఉర్రూతలూగించింది ప్రేక్షకులను. సమంత బోల్డ్నెస్, కిల్లర్ లుక్స్ తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టేసింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా…
ప్రస్తుతం ప్రతి సినిమాలోనూ సీనియర్ స్టార్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఇది ఒక ట్రెండ్ గా నడుస్తుంది అని చెప్పాలి. ఇటీవల రాధేశ్యామ్ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇక రాధికా, ఖుష్బూ, నదియా, ఆమని లాంటి వారు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక వీరితో పాటు స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న సీనియర్ నటి ఇంద్రజ.. ప్రస్తుతం వరుస సినిమాలతో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్ సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధమైంది. తాజాగా ‘పుష్ప’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు…
గీతాగోవిందం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ సినిమా తరువాత వెనక్కి చూసుకోకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పాన్ ఇండియా మూవీలో నటించే వరకు వచ్చింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 4 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం…
శర్వానంద్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”తోమార్చి 4న థియేటర్లలోకి రాబోతున్నాడు. రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధాకర్ నిర్మించారు. ఆదివారం “ఆడవాళ్లు మీకు జోహార్లు” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా… ఈ వేడుకకు అతిథిగా హాజరైన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరో శర్వానంద్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముందుగా తనను ఈ వేడుకకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. తన ఫస్ట్…
శర్వానంద్ చాలా కాలం తర్వాత ఫ్యామిలీ డ్రామా “ఆడవాళ్లు మీకు జోహార్లు”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధాకర్ నిర్మించారు. రష్మిక మందన్న ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఆదివారం “ఆడవాళ్లు మీకు జోహార్లు” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో శర్వానంద్ పై రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది. “నేను శర్వానంద్ని ఎంత ఇరిటేట్ చేసినా ఆయన ఎప్పుడూ చిరాకు పడడు. నేను ఇప్పటి వరకూ…