టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించడం విశేషం. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఫ్రెష్ ఫీల్ కలిగిస్తోంది. ” నాకు తెలియని ఒక అమ్మాయి చెప్పింది .. ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించామంటే ఆన్సర్ ఉండకూడదు” అని నిఖిల్ డైలాగ్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక కథను కొద్దిగా రివీల్ చేసినట్లు కనిపిస్తుంది.
అనుపమ తన ప్రేమ భావాలను డైరీలో రాయడం.. అది నిఖిల్ కి దొరికి ఆ డైరీని చదవి ఆమెతో ప్రేమలో పడడం.. చివరికి ఈ డైరీ వలన ఆ ప్రేమ జంట కలిసిందా ..? లేదా ..? అనేది కథగా తెలుస్తోంది. సుకుమార్, ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఇలాంటి యూత్ స్టోరీగా కుమారి 21 ఎఫ్ ని నిర్మించి హిట్ అందుకున్నారు. ఆ సినిమా తరువాత 18 పేజెస్ కోసం ఈ గురుశిష్యులు కలిశారు. ఇక ఈ ఫస్ట్ గ్లింప్స్ లో అనుపమ ఎంతో అందంగా కనిపించగా నిఖిల్ స్టూడెంట్ లా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సాంగ్ ఆకట్టుకొంటుంది. మొత్తానికి ఫస్ట్ గ్లింప్స్ తోనే కొత్త ఫీల్ ని తెచ్చిన ఈ టీమ్ ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుతుందేమో చూడాలి.