Pushpa The Rule : రంగంలోకి బాలీవుడ్ స్టార్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్, సామ్ గ్లామర్, రష్మిక అభినయం, దేవిశ్రీ సంగీతం… సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్ కు ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. బన్నీ కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అనిపించినా “పుష్ప” చిత్రం సీక్వెల్ “పుష్ప : ది రూల్” పేరుతో రూపొందనుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో “పుష్ప”కు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.
Read Also : Pratik Gandhi : ముంబై పోలీసుల వల్ల అవమానం… నటుడి ఆవేదన
Also Read
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ఇక తాజాగా సెట్స్ పైకి వెళ్లనున్న “పుష్ప-2” కోసం మేకర్స్ బాలీవుడ్ స్టార్ ని రంగంలోకి దింపబోతున్నారట. ఇంతకుముందు పార్ట్ లో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కన్పించారు. కానీ బాలీవుడ్ నుంచి ఎవరూ కన్పించలేదు. అయినప్పటికీ ఈ చిత్రంలో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపింది. దీంతో పార్ట్ 2లో మేకర్స్ బీటౌన్ నుంచి ఒక నటుడిని తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా, భన్వర్ సింగ్ షెకావత్ కు పై అధికారికంగా కన్పించబోతున్నారట. స్మగ్లింగ్ సిండికేట్ కింగ్ పుష్పకు, భన్వర్ లాల్ కు మధ్య జరిగే పోరాటంలో సునీల్ శెట్టి పాత్ర అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుందని అంటున్నారు. మరి సునీల్ శెట్టి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతమేరకు దగ్గర అవుతారో చూడాలి.
తాజావార్తలు
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!