కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తునే.. తాము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని.. అస్తులు అమ్ముకుని ప్రజలకు సేవ చేశామని మాజీ కాంగ్రెస్ నేత సుజాత తెలిపారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
జబర్దస్త్ కామెడియన్ రాకింగ్ రాకేష్.. జోర్దార్ సుజాత ఇటీవల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరికీ క్రేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఈ మధ్య విదేశాల్లో తెగ విహరిస్తున్నారు. తన వృత్తిలో భాగంగా ఈవెంట్‌లు చేయడానికి తరచూ రాకింగ్ రాకేష్ విదేశాలు వెళ్తుంటారు. అయితే, ఇప్పుడు తన భార్యతో కలిసి జంటగా వెళ్తున్నారు. సతీమణికి తోడుగా కూడా వెళ్తున్నారు… అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. ఇక ఈ మధ్య…
చెన్నయ్ లో శుక్ర, శనివారాల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ జోన్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మెట్ జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించిన ఈ సమ్మెట్ లో దక్షిణాదికి చెందిన అగ్ర దర్శకులతో పాటు, స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. విశేషం ఏమంటే… గత కొన్ని రోజులుగా ఈ సమ్మెట్ నిర్వహణ బాధ్యతలను ప్రధానంగా నలుగురు మహిళామణులు తమ భుజాలకెత్తుకుని సమన్వయంతో నిర్వహిస్తున్నారు. వారే…
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో చాలామందికి తల్లిగా నటించి, అలరించిన సుజాత అందరికీ గుర్తుండే ఉంటారు. ఆ తరం అగ్రకథానాయకు లందరి సరసన సుజాత నాయికగా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించి అలరించిన సుజాత కొన్ని హిందీ సినిమాల్లోనూ అభినయించారు. సహజనటిగా పేరు సంపాదించిన సుజాత అనేక తెలుగు చిత్రాలలో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. సుజాత 1952 డిసెంబర్ 10న శ్రీలంకలోని గల్లేలో జన్మించారు. వారి మాతృభాష మళయాళం. ఆమె…