విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయ్యింది.. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్రూమ్‌లో జారిపడటంతో కూడి చేయి విరిగినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. లండన్‌లో ప్రాథమిక వైద్యం తీసుకున్న ఆయన్ను మెరుగైన వైద్య సేవల కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు..
Justice NV Ramana : తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. మహాసభలకు ముందు తెలుగు తల్లి విగ్రహానికి అంజలి ఘటించడం జరిగింది. ఈ మహాసభల్లో ఎంపీ సుజనా చౌదరి, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్,…
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఉగాది శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న తెలుగు వారి అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి పశ్చిమ నియోజకవర్గం ప్రజలు బుద్ది చెప్పబోతున్నారు అని పేర్కొన్నారు.
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు సుజనా చౌదరి.. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రావడానికి చంద్రబాబే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. పొడచూపిన విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు గతంలో జరిగాయి.. కానీ, ఫలించలేదన్న ఆయన.. స్వర్గీయ అరుణ్ జైట్లీ బతికి ఉన్నట్లయితే... ఏపీలో ఈ విభేదాలు, పరిస్థితులు ఇలా ఉండేవి కావన్నారు.