కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీ గ్రూపు తగాదాలు రోడ్డున పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి మధ్య గత కొంత కాలంగా ఉన్న విబేధాలు బయటపడ్డాయి. తన ఎంపీ ఫండ్స్‌తో ముస్లిం శ్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి పనులు చూడటానికి వెళ్తున్న బాలశౌరిని… పేర్ని నాని అనుచరుడు అడ్డుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఎంపీ వస్తే పేర్ని నాని వర్గం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని బాల శౌరీకి ముందే…
పార్లమెంట్‌లో పెద్దల సభగా పేరు పొందిన రాజ్యసభపై అధికార పార్టీ బీజేపీ పట్టు బిగిస్తోంది. చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో తన బలాన్ని బీజేపీ 100 సీట్లకు పెంచుకుంది. రాజ్యసభలో ఈ స్థాయిలో సీట్లు పొందడం బీజేపీకి ఇదే తొలిసారి. గతంలో ఒక్కసారి మాత్రమే రాజ్యసభలో ఓ పార్టీ 100 కంటే ఎక్కువ సీట్లను హస్తగతం చేసుకుంది. 1990లో కాంగ్రెస్ పార్టీ ఈ ఫీట్ సాధించింది. అప్పుడు పెద్దల సభకు ఆ పార్టీ తరఫున 108 మంది సభ్యులు…
మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మరోసారి ప్రకటన చేయడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయగా తాజాగా బీజేపీ కూడా జగన్ ప్రకటనను తప్పుబట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన మాటపై సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా మడం తిప్పారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అమరావతి రాజధానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ కట్టుబడి ఉందని ఆయన…
విశాఖపట్నంలో ఇవాళ పర్యటించిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఏపీ 30ఏళ్ళు వెనక్కుపోయిందని నిప్పులు చెరిగారు. బీహార్ కంటే దారుణమైన పాలన ఏపీలో ఉందని…రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లొసుగులు కారణంగానే కేంద్రాన్ని అడగలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో తలా తోక లేని పాలన జరుగుతోందని… వచ్చే 30 నెలల్లో భారతీయ జనతా పార్టీ సమర్ధత ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. హాయగ్రీవ జగదీశ్వరుడు వెనుక తన ప్రమేయం లేదన్నారు ఎంపీ…
ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఏపీ బీజేపీ కోర్ కమిటీని నియమించింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నేతృత్వంలో 16 మందితో కోర్ కమిటీని నియమించింది బీజేపీ అధినాయకత్వం. ఎంపీలైనా సరే తమను కోర్ కమిటీ భేటీలకు పిలవడం లేదని ఇటీవలే అమిత్ షా భేటీలో ఫిర్యాదు చేశారు సీఎం రమేష్, సుజనా చౌదరి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించిన కోర్ కమిటీ సభ్యులుగా సీఎం రమేష్, సుజనా తదితరులు వున్నారు.…