భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ భయాందోళనలో ఉంది. రెండు రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్ దాడి నుంచి తేరుకోక ముందే పాక్ లో పోలీస్ వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పెషావర్‌లోని చమ్కానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్‌లోని పశువుల మార్కెట్ సమీపంలో పోలీసు మొబైల్ వ్యాన్‌పై ఆత్మాహుతి దాడి జరిగిందని ఎస్‌ఎస్‌పి మసూద్ బంగాష్ తెలిపారు. Also…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ పేలుడులో కనీసం ఇద్దరు మరణించినట్లుగా అదికారులు వెల్లడించారు. పెషావర్‌లోని బోర్డ్ జబార్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్‌కి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
దాయాది దేశం పాకిస్తాన్ లో మరోసారి ముష్కర మూకలు రెచ్చిపోయాయి. పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారు ఉగ్రవాదులు. తనని తాను పేల్చుకొని ఆత్మహుతి దాడి చేసి ఎంతో మందిని బలితీసుకున్నాడు ఓ దుర్మార్గుడు. బలూచిస్థాన్ ప్రావిన్సులోని మస్తుంగ్ జిల్లాలో ఇది జరిగింది. మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని భక్తులు ఎంతో సంతోషంగా ర్యాలీకి సమాయత్తం అవుతున్నారు మస్తుంగ్ జిల్లాలో. ఇంతలోనే ఓ అనుకోని ఘటన జరిగింది. Also Read: Cars under 6 Lakhs: రూ.6…
రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకున్న పాకిస్థాన్‌లో భద్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో మంగళవారం పారామిలటరీ ఫోర్స్ వాహనం సమీపంలో జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు గాయపడ్డారని తెలిసింది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు దాడితో దద్దరిల్లింది. ఈ వారం ప్రారంభంలో హత్యకు గురైన ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. బదక్షన్ ప్రావిన్స్ రాజధాని ఫైజాబాద్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ బాంబుదాడిలో 11 మంది మరణించగా.. 30 మంది గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది.
ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి కొద్ది దూరంలో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు పౌరులు మరణించగా.. అనేక మంది గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడి చేసిన వ్యక్తిని ఆఫ్ఘన్ దళాలు గుర్తించాయి.
Suicide blast in Pakistan's Islamabad: దాయాది దేశం పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. రాజధాని ఇస్లామాబాద్ లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇస్లామాబాద్ లోని అత్యంత కట్టుదిట్టమైన, దేశ పార్లమెంట్, ఉన్నతాధికారుల కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలకు వెళ్లే దారిలో ఈ ఘటనల జరగడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. పేలుడు సంభవించిన వెంటనే ఉగ్రవాద వ్యతిరేక దళం ఘటనాస్థలానికి చేరుకుంది. ఈ పేలుడులో ఒక హెడ్ కానిస్టేబుల్ మరణించగా.. నలుగురు పోలీసులు గాయపడ్డారు. మరణించిన పోలీస్…
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో ఆత్మాహుతి పేలుడులో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. పేలుడులో గాయపడిన మహిళ మరణించింది. 23 మంది పోలీసులతో సహా 27 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు మృతుల సంఖ్యకు సంబంధించిన అప్‌డేట్‌ను వెల్లడించారు.
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాకేంద్రం వద్ద భారీ పేలుడు సంభవించింది.