కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జరుగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. శనివారం, సీఈ సుధాకర్ రెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల టెండర్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా, సుధాకర్ రెడ్డి తనిఖీలు లేకుండా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి సబ్ స్టాన్షియల్ పత్రం ఇచ్చినట్లు అంగీకరించారు. డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్‌కు డబ్బులు కేటాయించినట్లు వివరించారు. మేడిగడ్డ డిజైన్ ఖరారు చేసే సమయంలో ఎల్ అండ్ టీని సంప్రదించినట్లు చెప్పారు.…
తెలుగువారి వన్ అండ్ ఓన్లీ ఓటీటీ సంస్థ ఆహాలో మరో రియాలిటీ షో ప్రారంభం కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని మహిళా వ్యాపారవేత్తలకు ఆహా 'నేను సూపర్ ఉమన్' అనే రియాలిటీ షోలో ఛాన్స్ ఇవ్వబోతోంది.
జర్నలిస్ట్ గా, ఫిల్మ్ పీఆర్వోగా రాఘవేంద్రరెడ్డి దాదాపు పాతిక సంవత్సరాలు పనిచేశారు. గత కొంతకాలంగా ఆయన పలు సినిమాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. అలానే ఆయన తన అనుభవాన్ని రంగరించి రాసిన ఓ కథ ఇప్పుడు సినిమాగా తెరకెక్కుతోంది. అదే ‘శాసనసభ’. నటుడు ఇంద్రసేన ను దృష్టిలో పెట్టుకుని ఆయన రాసిన ఈ కథను వేణు మడికంటి దర్శకత్వంలో తలసీరామ్ సాస్పని, షణ్ముగం సాస్పని నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ పొలిటికల్ థ్రిల్లర్ నాన్ ఇండియా…
నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన సినిమా ‘ఇష్క్’. 2012, ఫిబ్రవరి 24న విడుదలై అద్భుతమైన విజయాన్ని చవిచూసిందీ మూవీ. ఈ చిత్రం పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ తమ మనోభావాలను ఇలా తెలియచేశారు. హీరో నితిన్: ” ‘ఇష్క్’ నా కెరీర్‌లో మెమొరలబుల్ సినిమా. నటుడిగా నాకు రీ-బర్త్ ఇచ్చింది. ఇంత మంచి సినిమాను దర్శకుడు విక్రమ్ నాకు ఇచ్చారు. పి. సి. శ్రీరామ్ కెమెరా అద్భుతంగా తీశారు. ఈ సినిమా…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’.. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ జోడీగా నభా నటేశ్ నటిస్తోంది. ఓ కీలకమైన పాత్రలో తమన్నా చేసింది. హిందీలో సక్సెస్ అయిన ‘అంధాదున్’ సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా వస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్…
రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు అని అడిషనల్ అడ్వకేట్ జనరల్పొన్నవోలు సుధాకర్ అన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం డిస్మిస్ చేసింది మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చారు. అప్పటివరకు కూడా రఘురామకృష్ణరాజు మామూలుగానే ఉన్నారు. పిటిషన్ డిస్మిస్ కాగానే రఘురామ కృష్ణరాజు కొత్త నాటకానికి తెరతీశారు అని పేర్కొన్నారు. పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారు అని ఏఏజీ పొన్నవోలు తెలిపారు. రఘరామ కృష్ణరాజు ఆరోపణలపై కోర్టు మెడికల్ కమిటీ వేసింది. రేపు మధ్యాహ్నంలోగా…