రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు అని అడిషనల్ అడ్వకేట్ జనరల్
పొన్నవోలు సుధాకర్ అన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం డిస్మిస్ చేసింది మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చారు. అప్పటివరకు కూడా రఘురామకృష్ణరాజు మామూలుగానే ఉన్నారు. పిటిషన్ డిస్మిస్ కాగానే రఘురామ కృష్ణరాజు కొత్త నాటకానికి తెరతీశారు అని పేర్కొన్నారు. పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కోర్టులో కట్టుకథ అల్లారు అని ఏఏజీ పొన్నవోలు తెలిపారు. రఘరామ కృష్ణరాజు ఆరోపణలపై కోర్టు మెడికల్ కమిటీ వేసింది. రేపు మధ్యాహ్నంలోగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది అని పొన్నవోలు పేర్కొన్నారు.