Aha: ‘నేను సూపర్ ఉమన్’ బిజినెస్ రియాలిటీ షో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AHA: తెలుగువారి వన్ అండ్ ఓన్లీ ఓటీటీ సంస్థ ఆహాలో మరో రియాలిటీ షో ప్రారంభం కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని మహిళా వ్యాపారవేత్తలకు ఆహా ఈ రియాలిటీ షోలో ఛాన్స్ ఇవ్వబోతోంది. వి హబ్, గ్రూప్ ఎం తో కలిసి ఆహా నిర్వహిస్తున్న ‘నేను సూపర్ ఉమన్’ బిజినెస్ షో సమ్ థింగ్ డిఫరెంట్ గా ఉండబోతోంది. వ్యాపార రంగంలో అడుగుపెట్టాలని అనుకుంటున్న వారు, ఇప్పటికే ఆ రంగంలో ఉన్నవారు, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్న వారు ఈ షోలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 5 లోపు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ను అందచేయాల్సి ఉంటుంది. ఇది రియాలిటీ షో నాలుగు స్టేజెస్ లో జరుగుతుంది. మొదట ఆన్ లైన్ లో ద్వారా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని, నియమ నిబంధనలను చదివి అప్లయ్ చేయాలి. ఆ తర్వాత వాటిలోంచి ఎంపిక చేసిన వారికి మూడు రోజుల పాటు ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తారు. వారిలో కొందరిని సెలక్ట్ చేసి, మెంటర్స్ తో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. వారిలోంచి 40 మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలను ఎంపిక చేసి, వారితో ఫైనల్స్ నిర్వహిస్తారు. ఈ టైమ్ లో వారు తమ వ్యాపారం గురించి, దానిపై తమకు ఉన్న అవగాహన గురించి, దాని లోతుపాతుల గురించి చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా ‘నేను సూపర్ ఉమన్’ అనే బిజినెస్ రియాలిటీ షోను ఆహా నిర్వహించబోతోంది.
ఈ షోను నిర్వహించేందుకు సక్సెస్ ఫుల్ బిజినెస్ పర్సనాలిటీస్ తో ఓ ప్యానల్ ను ఏర్పాటు చేశారు. ఐఐఎం లక్నోకు చెందిన రోహిత్ చెన్నమనేని ఇందులో ఉంటారు. ఆయన డార్విన్ బాక్స్ కో ఫౌండర్. ఆయనతో పాటుగా ముద్ర వెంచర్స్ ఫౌండర్ స్వాతిరెడ్డి గునుపాటి, క్వాంటేలా ఇంక్ కు చెందిన శ్రీధర్ గది, సిల్వర్ నీడిల్ వెంచర్స్ పార్ట్ నర్ రేణుక బొడ్ల, అభి బస్ ఫౌండర్ అండ్ సి.ఇ.ఓ. సుధాకర్ రెడ్డి ఈ షోకు ‘ఏంజెల్స్’గా వ్యవహరించబోతున్నారు. వీరంతా తమ అనుభవాలను కొత్త మహిళా వ్యాపారవేత్తలకు అందిస్తారు. వీరి ఆధ్వర్యంలో ఆహా ‘నేను సూపర్ ఉమన్’ బిజినెస్ రియాలిటీ షోను సరికొత్తగా డిజైన్ చేసింది.
Also Read
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
-
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
-
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
-
President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..