అంబర్‌పేట్‌లో నలుగరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు19వ తేదీ నుంచి కన్పించకుండా పోయారు. అంబర్‌పేట్, ప్రేమ్‌నగర్‌కు చెందిన ఎండి అజమత్ అలీ(13), కొండ్‌పేట తేజ్‌నాథ్ రెడ్డి(13), నితీష్ చౌదరి(13), కోరే హర్ష వర్ధన్(13) నలుగురు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. స్కూల్ ఎగ్జామ్స్‌లో కాపీ కొడుతూ దొరికారు. టీచర్ వారిని మందలించింది..
విశాఖపట్నంలో నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. ఈ మధ్య రిలీజ్ అయినా లక్కీ భాస్కర్ అనే మూవీ చూసిన విద్యార్థులు అందులో హీరో తరహాలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చు.. కార్లు, ఇళ్లు కొనేసి తిరిగి వస్తామని స్నేహితుల వద్ద చెప్పి హాస్టల్ నుండి పరారయ్యారని తెలుస్తోంది.. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గౌతమి గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. మరో ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
చదువులంటే వారికిష్టం లేదు. అస్తమానూ స్కూల్‌కి వెళ్ళడం, హోంవర్కులు రాయడం వారి బుర్రకు పట్టలేదు. అందుకే ఆ మార్గం ఎంచుకున్నారు. చదవడం ఇష్టం లేక నలుగురు విద్యార్థులు అదృశ్యం అయిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగింది. పటాన్ చెరు గౌతంనగర్ కాలనీకి చెందిన నలుగురు స్నేహితులు ఈ పని చేశారు. రాహుల్, ఎనిమిదవ తరగతి, విక్రమ్ నాలుగో తరగతి, ప్రీతమ్ నాలుగో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. పిల్లలు కనిపించకపోవడంతో…
హైదరాబాద్ బోరబండలో ఇద్దరు విద్యార్ధులు కనిపించకుండా పోయారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బోరబండలో 6,7 తరగతి చదువుతున్న ఇద్దరు అన్నా, తమ్ముళ్లు ఆదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ సైట్-3 లేబర్ అడ్డా ప్రాంతానికి చెందిన రాజు నాయక్ ఇద్దరు కుమారులైన గణేష్(10), రమేష్(12)లు స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. మంగళవారం ఉదయం పనికి వెళ్ళారు తల్లిదండ్రులు. అయితే, సాయంత్రం ఇంటికి వచ్చే చూసే సరికి…