విశ్వవిద్యాలయాలు.. ఆ పేరుకు తగ్గట్టుగానే ఉండాలి. యూనివర్సిటీలు తమ ఔనత్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ గొప్ప పేరు సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రమే విశ్వవిద్యాలయాల మీద నమ్మకం కలుగుతుంది.
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్ అయింది. జులై 10న విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారు ఈ విడతలో లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందారు.…
వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ ను కలిశారు వైద్య విద్యార్ధులు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు.
TGSRTC : తెలంగాణలో ప్రజలకు మరోసారి ఆర్డినరీ వాహన రవాణా రంగంలో ఖర్చు భారమైంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. కొత్త బస్ పాస్ ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెంపు ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులపై కూడా తీవ్రంగా పడనుంది. ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, పాస్ చార్జీలను సగటున 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచినట్టు తెలుస్తోంది.…
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్కసారిగా స్కూల్ టీచర్‌గా మారిపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి ఎద్దడితో ఎడారిగా మారకుండా ఉండాలంటే.. మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు నిర్మలా సీతారామన్.. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు క్లాస్ తీసుకున్న నిర్మలా సీతారామన్.. మొక్కల విశిష్టత - ఉపయోగాలు అంశంపై విద్యార్థులకు వివరించారు..
Military Basic Training: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం లాంటి సద్గుణాలు పెంపొందించడానికి బేసిక్ మిలిటరీ శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ దాదా భూసే పేర్కొన్నారు.
దేశ భవిష్యత్ తరగతి గదుల్లో ఉంది.. అందరూ జీవితంలో రాణించేలా చదువుకోండి.. పిలిస్తే పలికేలా నేను ఉంటా.. పని చేస్తా.. యంగ్ ఇండియా నా బ్రాండ్.. నా బ్రాండ్ అంబాసిడర్లు మీరే అని పేర్కొన్నారు. అలాగే, ప్రజా ప్రభుత్వంలో దళిత బిడ్డలకు పట్టంకట్టాం.. కులం వల్ల ఎవరికీ సమాజంలో గుర్తింపు రాలేని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ అకస్మాత్తుగా ఢిల్లీ యూనివర్సిటీలోకి వచ్చేశారు. అయితే రాహుల్ రాకపై విశ్వవిద్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది.
స్కూల్ డేస్లో తనది లాస్ట్ బెంచ్ అని, తమది అల్లరి బ్యాచ్ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. స్కూల్‌లో పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే అని పేర్కొన్నారు. ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ.. అధికారపక్షం సభ్యులు ప్రతిపక్షం కంటే కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పారు. తన తండ్రి, సీఎం నారా చంద్రబాబు గారి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ తనకు ఇష్టమైన కొటేషన్ అని…
ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం. ఈ సాంకేతిక ప్రపంచంలో సెల్ఫోన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. నిద్ర లేచిన దగ్గర్నుంచి.. నిద్రపోయే వరకు సెల్ఫోన్ మనం చేతిలోనే ఉంటుంది. సెల్ఫోన్ చేతిలో ఉంటే అందరూ ఈ ప్రపంచాన్నే మరిచిపోతున్నారు. కొందరు అయితే మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించలేనంతగా మైమరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సెల్ ఫోన్.. ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతున్న ఆ ఇద్దరూ రైలు…