విద్యార్థులు రాను రాను ఎంత దారుణంగా తయారు అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. క్షణికావేశంలో దారుణంగా తయారవుతున్నారు.. టీచర్స్ ఏదైనా అంటే అదే మనసులో పెట్టుకొని కక్ష్య సాధిస్తున్నారు.. వారిపై దాడికి తెగ బడుతున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో వెలుగు చూసింది.. పరీక్షల్లో కాపీ కొట్టనివ్వలేదని ప్రిన్సిపాల్ పై అతి దారుణంగా బ్లేడు తీసుకొని గొంతు కోశాడు.. ఈ దారుణ ఘటన ప్రకాశంలోకి వెలుగుచూసింది.. పరీక్షలో కాపీ కొడుతుంటే పట్టుకుని డిబార్ చేయించాడని కాలేజీ ప్రిన్సిపల్ పై…
ఓ బాలిక తన కన్నతల్లిపైనే అధికారులకు ఫిర్యాదు చేసింది.. పది పాసైన నన్ను పై చదువులకు పంపించకుండా.. అమ్మ కూలి పనికి తీసుకెళ్తుందని ఆవేదన వ్యక్తం చే సింది..
4వ తరగతి చదువుతున్న చిన్నారిని టీచర్ నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. గురువుగారి నిర్వాకం అంతా సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది. 30 నిమిషాల్లో ఉపాధ్యాయుడు 23 సార్లు చెంపదెబ్బ కొట్టాడు. అయితే వచ్చే వారమే గురువుగారి వివాహం జరగనుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒక అమ్మాయి చేసింది. పట్టా తీసుకోబోతూ స్టేజీపై చిన్న డాన్స్ మూమేంట్ చేసింది. పాపం.. అదే ఆమె కొంప ముంచింది. డాన్స్ చేసినందుకు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అప్పటి వరకు ఉన్న ఆనందరం కాస్త.. తీరని దు:ఖంగా మారింది.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న విద్యార్థి రాహుల్ ఇంట్లో గొడవ పడి సూసైడ్ చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ధనలక్ష్మి ఫర్టీ లైజర్ షాపులో పురుగుల మందు కొనుగోలు చేసి పక్కనే ఉన్న పర్వతపురం గుట్టల్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. అనంతరం రాహుల్ ఇంటికి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నట్లు తెలిపాడు.
ఢిల్లీ యూనివర్శిటీ సౌత్ క్యాంపస్‌లో హత్య కేసు వెలుగు చూసింది. సౌత్ క్యాంపస్‌లోని ఆర్యభట్ట కళాశాలలో విద్యార్థులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఇంతలో ఒక విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో విద్యార్థి మృతి చెందాడు. కత్తిపోట్లకు గురైన విద్యార్థి నిఖిల్ చౌహాన్(19) గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పీయూసి ప్రథమ సంవత్సరం చదువుతున్న వడ్ల దీపికగా గుర్తించారు. మృతురాలు స్వస్థలం సంగారెడ్డి జిల్లా గొర్రెకల్.
మలేషియాలో ఓ విచిత్రమై ఘటన జరిగింది. 22 ఏళ్ల వ్యక్తికి 48 ఏళ్ల టీచర్కి పెళ్లి జరిగింది. వీరి ప్రేమ కథేంటో తెలిస్తే మీరు తప్పకుండ ఆశ్చర్యపోతారు. మొహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ వయస్సు 22 సంవత్సరాలు.
అనకాపల్లి జిల్లాలోని దిబ్బలపాలెం గ్రామానికి చెందిన పెంటకోట మధుకుమార్ ( 20 ) అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగ్ లు కట్టే అలవాటున్న మధుకుమార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పందేల కోసం అదే గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలంటూ అతడి నుంచి ఒత్తిడి పెరిగింది. అయితే, తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఈ నెల 23న రాత్రి ఎలుకల మందు…