విద్యార్థులు రాను రాను ఎంత దారుణంగా తయారు అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. క్షణికావేశంలో దారుణంగా తయారవుతున్నారు.. టీచర్స్ ఏదైనా అంటే అదే మనసులో పెట్టుకొని కక్ష్య సాధిస్తున్నారు.. వారిపై దాడికి తెగ బడుతున్నారు.. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో వెలుగు చూసింది.. పరీక్షల్లో కాపీ కొట్టనివ్వలేదని ప్రిన్సిపాల్ పై అతి దారుణంగా బ్లేడు తీసుకొని గొంతు కోశాడు.. ఈ దారుణ ఘటన ప్రకాశంలోకి వెలుగుచూసింది..
పరీక్షలో కాపీ కొడుతుంటే పట్టుకుని డిబార్ చేయించాడని కాలేజీ ప్రిన్సిపల్ పై కక్షగట్టాడు ఇంటర్మీడియట్ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. పట్టపగలే నడిరోడ్డుపై ప్రిన్సిపల్ ను పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. ఈ దాడిలో గాయపడ్డ ప్రిన్సిపాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్నాడు..పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చిన్నమసీదు ప్రాంతంతో గొంట్ల గణేష్ తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. స్థానికంగా గల జూనియర్ కాలేజీలో అతడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గతేడాది గిద్దలూరులోని సాహితీ జూనియర్ కాలేజీలో అతడు పరీక్షలకు హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అతడు కాపీ కొడుతుండగా కాలేజీ ప్రిన్సిపల్ కొండారెడ్డి పట్టుకున్నాడు. దీంతో ఎగ్జామ్ సెంటర్ అధికారులు గణేష్ డీబార్ చేసారు..
అందరు అవమానించడంతో ప్రిన్సిపాల్ పై కక్ష్య పెంచుకున్నాడు.. తనను ఎలాగైనా చంపెయ్యాలని అనుకున్నాడు..గాంధీబొమ్మ సెంటర్ వద్ద కొండారెడ్డి కనిపించాడు. దీంతో ఒక్కసారిగా బ్లేడ్ తో దాడికి తెగబడ్డాడు. గొంతు కోసి చంపడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన కొండారెడ్డి తప్పించుకునేందుకు చేయి అడ్డుపెట్టాడు. దీంతో గొంతుతో పాటు చేయికి కూడా గాయమయ్యింది. అనంతరం గణేష్ అక్కడినుండి పరారయ్యాడు. రక్తస్రావంతో కిందపడిపోయిన ప్రిన్సిపల్ కొండారెడ్డిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. వెంటనే వైద్యం అందించిన డాక్టర్లు ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని తెలిపారు.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..