YSRCP Protest: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టనుంది. ఈ ర్యాలీలో వైసీపీ శ్రేణులతో పాటు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు కలసి రావాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ..
Read Also: Vemulawada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. భక్తుల ఆగ్రహం!
17 నెలల్లో 2.50 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఐదు వేల కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయలేక పోతుందంటూ వైసీపీ మండిపడుతోంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ నిరనన ర్యాలీలకు హాజరు కావాలని కోరింది. 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలతో కలసి నిరసన ర్యాలీలు చేపట్టనుంది వైసీపీ. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నూతన మెడికల్ కళాశాలలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే, ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవంటూ వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.
రాష్ట్రంలో 2019కి ముందు వరకు 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలను గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించటంతో 750 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.. పాడేరు, పులివెందుల మెడికల్ కళాశాలలు పూర్తి కాగా.. మిగతా 10 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.. అయితే, ఈ కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్ లో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు సిద్దం కావటంతో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైసీపీ ఉద్యమ కార్యచరణ రూపొందించింది. ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రారంభించింది.. ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే 10 కొత్త వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే పూర్తై చేసుకుని అందుబాటులోకి వస్తాయని.. 17 నెలల్లో 2.50 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఐదు వేల కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయలేక పోతుందంటూ నిరసన కార్యక్రమాలను మొదలు పెట్టింది..