Tragedy : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే యువత అమెరికా వంటి దేశాల్లో జరుగుతున్న దారుణ ఘటనలకు బలైపోతున్నారని తాజా ఉదాహరణ మరోసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని డాలస్ నగరంలో కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ స్వదేశంలో బీడీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. డాలస్‌లో నివాసం తీసుకొని చదువుకుంటూ, అదనంగా ఒక పెట్రోల్ బంక్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తున్నారు.…
Nandini Kashyap : ఓ స్టూడెంట్ ను కారుతో ఢీకొట్టడంతో అతను చనిపోయిన కేసులో హీరోయిన్ అరెస్ట్ అయింది. ఆమె ఎవరో కాదు హిందీ నటి నందినీ కశ్యప్. జులై 25న తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఆమె ఓ పార్టీ నుంచి తన ఇంటికి బయలు దేరింది. బొలెరో కార్ లో వెళ్తుండగా దఖింగావ్ ఏరియాలో ఓ స్టూడెంట్ ను ఢీ కొట్టి అక్కడి నుంచి పారిపోయింది. ఆ స్టూడెంట్ ను సమియుల్ హక్ గా…
Tragedy : హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని హన్సిక (14) ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులు, స్నేహితులను మృదువుగా కలిచివేసింది. ఈ ఘటన మియాపూర్‌లోని జనప్రియ అపార్ట్మెంట్స్‌లో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, హన్సిక ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం సమయంలో ఆ బాలిక అపార్ట్మెంట్ భవనం పై నుండి దూకింది. Luxury Cars Tax Penalty: అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్…
Bobbili Tragedy: విజయనగరం జిల్లా బొబ్బిలిలో స్కూల్ విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న కొట్లాట ఒక విద్యార్థి ప్రాణం తీసింది. సుందరాడ కార్తీక్ అనే విద్యార్థి మృతికి అభ్యుదయ స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాలని అంబేద్కర్ పోరాట సమితి డిమాండ్ చేస్తోంది.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. గుండె నొప్పితో ఇంటర్ సెకండియర్ విద్యార్థి మృతి చెందాడు. ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బత్తిని మనితేజ (17) గుండె నొప్పితో మృత్యుఒడికి చేరుకున్నాడు. మణితేజ స్వగ్రామం శాయంపేట మండలం ప్రగతి సింగారం.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల భూమిక్ లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడి తండ్రి బిటి లక్ష్మణ్ భావోద్వేగ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో బిటి లక్ష్మణ్ తన కొడుకు సమాధిపై పడి బోరున విలపిస్తున్నాడు.
KTR : నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెంబి మండలం లోతేర తండాకు చెందిన అక్కాచెల్లెళ్లు బాణావత్ మంజుల, బాణావత్ అశ్వినీలు శుక్రవారం ఎంసెట్ పరీక్ష రాసి తిరిగే సమయంలో ఆర్మూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చిన కేటీఆర్, మృతుల తండ్రి బాణావత్ రెడ్డి ఉపాధి నిమిత్తం…
Online Betting : హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు యువత జీవితాలను బలిగొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, అత్తాపూర్ రెడ్డి కాలనీలో మాసబ్ ట్యాంక్‌లోని జేఎన్‌టీయూ (JNTU)లో ఎం.టెక్ చదువుతున్న విద్యార్థి పవన్ (23) బెట్టింగ్ యాప్‌లలో భారీగా నష్టపోయి, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల కలిగే ప్రమాదాలను మరోసారి గుర్తు చేస్తోంది. అత్తాపూర్ రెడ్డి కాలనీలో నివాసముంటున్న పవన్,…
గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. తోటి విద్యార్థుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు. మైదానంలో ఫీల్డింగ్‌లో ఉండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుర్తించిన విద్యార్థులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్నేహితుడు కళ్ల ముందే…