గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది, కొన్నిచోట్ల కుక్కలను చంపేస్తున్న ఘటనలు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం సహా మున్సిపల్ యంత్రాంగం అనుసరిస్తున్న తీరుపై సినీ నటి, జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మూగజీవులను దారుణంగా హతమార్చడం అమానుషమని ఆమె ధ్వజమెత్తారు. “ప్రతి వంద కుక్కలలో కేవలం ఐదు మాత్రమే దూకుడు స్వభావాన్ని కలిగి ఉండవచ్చు, ఆ ఐదు కుక్కల కారణంగా…
Supreme Court: వీధికుక్కలకు సంబంధించిన కేసును గురువారం జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వి అంజరియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కొనసాగించింది. జంతు ప్రేమికులు, కుక్క కాటు బాధితులు, జంతు హక్కుల కార్యకర్తలు తమ వాదనల్ని సమర్పించారు. జంతు సంక్షేమ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది సియూ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కులు ఢిల్లీలో సమతుల్యతను కాపాడుతున్నాయని, ఇవి ఎలుకలు, కోతుల ముప్పును రక్షిస్తున్నాయని, కుక్కలను హఠాత్తుగా తొలగిస్తే ఎలుకల…
Amala : అక్కినేని అమల ఎంత సెన్సిటివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూనే తన పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు. అలాంటి అమల శివ ప్రమోసన్లలో మొన్నటి వరకు బిజీగా గడిపారు. అందులో భాగంగానే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఇందులో ఆమె చాలా విషయాలను పంచున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కడైనా కుక్కలు ఎవరినైనా కరిస్తే ముందు తననే తిట్టుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం…
Divorce Case: గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి విడాకుల కోసం వింత కారణాన్ని లేవనెత్తారు. "తన భార్యకు వీధి కుక్కలు అంటే చాలా ప్రేమ అని, ఇది తనపై క్రూరత్వాన్ని చూపిస్తోందని" అహ్మదాబాద్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తన విడాకుల అభ్యర్థనను తోసిపుచ్చిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఆయన హైకోర్టుకు వెళ్లారు. భార్యకు కుక్కలపై ఉన్న ప్రేమ తమ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా నెలకొన్న కుక్కల బెడదపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఇటీవల కుక్కల సమస్యపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయంగా భారతదేశ గౌరవం డ్యామేజ్ అవుతున్నా మేలుకోరా? అంటూ వ్యాఖ్యానించింది.
వీధి కుక్కల టాపిక్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్ కు తరలించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన అనంతరం జంతు ప్రేమికులు నిరసనలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వీధి కుక్క కారణంగా ఓ మహిళా ఎస్ఐ ప్రాణాలు కోల్పోయింది. వీధి కుక్కను కాపాడే ప్రయత్నంలో ఆమె బైక్ పై నుంచి పడిపోవడంతో మృతి చెందింది. ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ తన బైక్ పై నుంచి…
RGV : సుప్రీంకోర్టు తీర్పుతో డాగ్ లవర్స్ అందరూ సోషల్ మీడియాలో ఒకటే ఏడుపు. ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో హీరోయిన్ జాన్వీకపూర్, సదా లాంటి వారు ఏడుస్తూ వీడియోలు పెట్టేస్తున్నారు. వారికి నెటిజన్లు దిమ్మతిరిగే కామెంట్లతో కౌంటర్లు ఇస్తున్నా.. అవి సరిపోవు అని నేరుగా ఆర్జీవీ రంగంలోకి దిగిపోయాడు. డాగ్ లవర్స్ కు వరుస కౌంటర్లు వేసేస్తున్నాడు. తాజాగా కుక్కల గురించి బాధపడుతున్న డాగ్…
ఎనిమిది వారాల్లోగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను ఆశ్రయాలకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని నటి సదా తీవ్రంగా వ్యతిరేకించారు. రేబిస్ వల్ల ఒక బాలిక మరణించిన సంఘటన ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. సదా ఈ నిర్ణయాన్ని “కుక్కల ఊచకోత”గా అభివర్ణించారు. “ప్రభుత్వం, స్థానిక సంస్థలు లక్షల కుక్కలకు ఆశ్రయాలు, టీకాలు వేయలేకపోవడం వారి అసమర్థత” అని ఆమె ఆరోపించారు. ABC (జంతు జనన నియంత్రణ) కార్యక్రమం సరిగ్గా అమలై ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని…