వీధికుక్కల దాడులతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో వీధిక్కులు చిన్న, పెద్ద అనే తేదా లేకుండా అందరిపై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఆస్పత్రుల పాలైయ్యారు.
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల నియంత్రణకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సూచించిన సూచనల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
గత కొన్ని రోజులుగా వీధి కుక్కలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లోని ఇద్దరు చిన్నారులను వీధి కుక్కలు కరిచి చంపేశాయి.
హైదరాబాద్ పరిధిలో కుక్కల దాడులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల అంబర్ పేటలో బాలుడి మృతి ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. కంటికి కనిపించిన వారిని కరుస్తూ ఆస్పత్రి పాలు చేస్తున్నాయి వీధి కుక్కలు.