Amala : అక్కినేని అమల ఎంత సెన్సిటివ్ గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూనే తన పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు. అలాంటి అమల శివ ప్రమోసన్లలో మొన్నటి వరకు బిజీగా గడిపారు. అందులో భాగంగానే ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఇందులో ఆమె చాలా విషయాలను పంచున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కడైనా కుక్కలు ఎవరినైనా కరిస్తే ముందు తననే తిట్టుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం మనం గతంలో కూడా చూశాం కదా. వీధి కుక్కల విషయంలో మొన్నటి వరకు దేశ వ్యాప్తంగా పెద్ద రచ్చ జరిగింది. అయితే అమల మొదటి నుంచి పెట్ లవర్. జంతువుల పట్ల ఎంతో సానుభూతితో ఉంటుంది.
Read Also : Bihar: రేపు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం !
ఆమెకు కుక్కలను, ఇతర జంతువులను పెంచుకునే అలవాటు కూడా ఉంది. అందుకే ఎక్కడైనా ఎవరినైనా కుక్క కరిస్తే సోషల్ మీడియాలో అమల పేరు ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. అమల పెట్ లవర్ కాబట్టి.. ఆమె లాంటి వాళ్లు కుక్కలను తరలిస్తే వద్దంటారని.. ఇప్పుడు ఇలా కరుస్తున్నాయంటూ కామెంట్లు చేయడం మనం ఎన్నో చూస్తుంటాం. ఇదే విషయంపై ఆమె ఎమోషనల్ అయ్యారు. కుక్కలను హాని చేయొద్దని చెప్పడం వల్లే తనను ఇంత మంది మాటలు అంటున్నారు అని ఆమె చెప్పుకొచ్చింది.
Read Also : Maoists killed: మూడు రోజులుగా కూంబింగ్.. ఏడుగురు మావోయిస్టులు మృతి!