వీధి కుక్కల టాపిక్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్ కు తరలించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన అనంతరం జంతు ప్రేమికులు నిరసనలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వీధి కుక్క కారణంగా ఓ మహిళా ఎస్ఐ ప్రాణాలు కోల్పోయింది. వీధి కుక్కను కాపాడే ప్రయత్నంలో ఆమె బైక్ పై నుంచి పడిపోవడంతో మృతి చెందింది. ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ తన బైక్ పై నుంచి పడిపోవడంతో వెనకాల వస్తున్న కారు ఢీకొట్టడంతో మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది.
Also Read:YS Viveka Murder Case: సుప్రీం కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ.. ఆ కేసులు క్వాష్..
కవి నగర్ పోలీస్ స్టేషన్ నుంచి డ్యూటీ ముగించుకుని రిచా సచన్ (25) ఇంటికి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ వీధి కుక్కను ఢీకొట్టడంతో ఆమె బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోయింది. వెనుక నుంచి వస్తున్న కారు ఆమెపైకి దూసుకెళ్లింది. హెల్మెట్ ధరించినప్పటికీ ఆమె తీవ్రంగా గాయపడింది అని కవి నగర్ అదనపు పోలీసు కమిషనర్ భాస్కర్ వర్మ పిటిఐకి తెలిపారు.
Also Read:Rowdy Sheeter Srikanth parole Episode: శ్రీకాంత్ పెరోల్ రద్దుపై ప్రియురాలు ఆసక్తికర పోస్ట్..
సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను సర్వోదయ ఆసుపత్రికి తీసుకెళ్లిందని, అక్కడ ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని ఆయన చెప్పారు. కాన్పూర్ నివాసి అయిన రిచా 2023లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. ఆమె శాస్త్రి నగర్ అవుట్ పోస్ట్ ఛార్జ్‌ని చూసుకుంటూ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతోంది. త్వరలోనే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో రిచా మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.