ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జగిత్యాల జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరువులు పొంగిపొర్లి గ్రామాలపై విరుచుకుపడుతుండటంతో పరిస్థితి దారుణంగా మారింది. రహదారులు దెబ్బతినగా, చిన్న చిన్న కాలువలు కూడా నదుల్లా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.