ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, వివిధ సంస్థల ప్రతిపాదనలపై చర్చ జరిగింది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) 4వ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో 10 సంస్థలకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.
అమరావతిలో ఈరోజు మద్యాహ్నం 12 గంటలకి స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డుపై సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు సంబంధించి చర్చిస్తారు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఇంధన శాఖలో కొన్ని కీలక ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలపనుంది. ఈ సమావేశం కోసం ఉదయం 11 గంటలకు సీఎం సచివాలయంకు చేరుకుంటారు. ఈ నెల 31న పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం,…
సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది.. పలు పరిశ్రమల ప్రతిపాదనలకు, ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.. ఈ సమావేశంలో మొత్తంగా రూ.19,037 కోట్ల పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది.. వాటి ద్వారా 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి..
Steel Plant: కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా కడప స్టీల్‌ప్లాంట్ కోసం రూ.23,985 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ మేరకు కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ అమోదముద్ర వేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న…
Andhra Pradesh: అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.81వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర…