వయనాడ్ విలయంపై వారం రోజుల క్రితమే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామంటూ రాజ్యసభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ తోసిపుచ్చారు.
మచిలీపట్నం వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల సంఘంపై అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నాడంటూ టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఈసీ లేఖ రాశారు.
నేటి రాజకీయాలలో చదువుకున్న వాళ్లకు కూడా వెలకట్టే పరిస్థితి వచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏకశిలా నగర్‌లో జరిగిన యూత్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణాను వరుణుడు వీడనంటున్నాడు. నాలుగైదు రోజుల నుంచి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దైంది. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. అయితే ఈనేపథ్యంలో.. నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. దీనికి తోడు అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ మహానగరంతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.…
రోడ్డు వేయిస్తాం నయా నగరాన్ని స్థాపిస్తాం ఇది ప్రతి నాయకుడు చెప్పేమాటలే. కానీ.. వారి మాటలు మాటలకు మాత్రమే పరిమితం మవుతున్నాయి. అడపాదడపా రోడ్డు వేయింది. చేతులు దులుపుకుంటారు. కానీ.. వర్షం వస్తే గాని ఆరోడ్డు పరిస్థితి అప్పటివరకు తెలియదు. వాన జల్లులతో గుంతలు, రోడ్డులో రాళ్లు అస్తవ్యస్తంగా మారి ప్రయాణికులకు నగరవాసులకు ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. దేశంలోనే ఇలాంటివన్నీ సాధారణంగా మారాయి. కానీ ఎప్పుడైనా ఖాళీ లేకుండా ఉన్న గుంతల వరుసలు వున్న రోడ్డును చూశారా. చూడకపోతే…
టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు కాలం ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు ఉండగా.. ఇకపై జీవితకాలం పనిచేయనుంది.. దీనిపై కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. గత ఏడాదిలో టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) పాలక మండలి నిర్ణయించింది. ఇప్పటివరకు టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉండగా.. ఇకపై దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మార్చాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై టెట్‌లో అర్హత…