Starlink: ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్‌తో రిలయన్స్ గ్రూప్‌కి చెంది జియో జట్టు కట్టింది. ఇప్పటికే, ఎయిర్‌టెల్ జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి దేశంలోని రెండు టెలికాం దిగ్గజాలు స్పేస్ ఎక్స్‌తో భాగస్వామ్యం కాబోతోన్నాయి.
Airtel: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్‌తో భారతీ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ వెల్లడించింది. భారతదేశంలో స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను తీసుకురావడానికి ఎయిర్‌టెల్ స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
Starlink: భారతదేశంలో ఇంటర్నెట్, టెలికాం రంగంలోకి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థ ‘‘స్టార్‌లింక్’’ సేవలు త్వరలో ఇండియాలో కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే, అత్యధిక జనాభా కలిగిన, అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ వాడుతున్న దేశంలో గేమ్ ఛేంజర్ అవుతుంది. ఒక వేళ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇండియాలోకి వస్తే ముఖేస్ అంబానీ జియో, సునీల్ భారతి మిట్టల్ ఎయిర్‌లెట్ వంటి…