చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎయిర్ షో చూసేందుకు జనం పోటెత్తారు. దీంతో.. మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారింది. బీచ్ కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
భారతదేశం ఆర్థికంగానూ.. అభివృద్ధిలోనూ దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ దేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లో వెలుగులోకి వచ్చిన సంఘటన ఇందుకు ఉదాహరణ.
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లోని ఖరేవాన్ సరయ్మీర్‌లో సమాజ్వాద్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే.. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభివాదం అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించేందుకు లేవగానే కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగి సభా వేదిక వద్ద తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా కార్యకర్తలు వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్దిసేపటి తర్వాత ప్రశాంత వాతావరణం ఏర్పడింది.
ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ హత్యకు గురై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సమాధి సమీపంలో జరిగిన రెండు శక్తివంతమైన బాంబు పేలుళ్లలో కనీసం 73 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Stampede: కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్ అండ్ టెక్నాలజీ(CUSAT)లో శనివారం జరిగిన మ్యూజిక్ ఫెస్ట్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు మరణించారు. 64 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ పాల్గొన్న ఈ కార్యక్రమం యూనివర్సిటీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది.
Stampede in Congo: రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సందర్భంగా రాత్రిపూట జరిగిన తొక్కిసలాటలో 37 మంది మరణించారు.
Stampede:చీరలు ఉచితంగా ఇస్తున్నారంటూ మహిళలు ఎగబడ్డారు.. చీరలు తీసుకోవడానికి పోటీపడ్డారు.. దీంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.. తమిళనాడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలో మురుగన్ తైపుసం వేడుకల్లో ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.. అయితే, ఒక్కసారిగా మహిళలు తోసుకురావడంతో.. తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మహిళలు ప్రాణాలు విడవగా.. మరో మరో 22 మంది మహిళలు తీవ్రగాయాలపాలయ్యారు.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి…