SS.Thaman: చిత్ర పరిశ్రమ.. ఎన్ని ప్రశంసలను అయితే ఇస్తుందో.. అంతే విమర్శలను అందిస్తుంది. ఒక సినిమా బావుంటే ఆకాశానికి ఎత్తినవారే.. మరో సినిమా బాగోలేకపోతే అధఃపాతాళానికి తొక్కేస్తారు. ఇక్కడ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లే కాదు.. హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు సైతం ట్రోల్స్ కు గురవుతున్నారు.