ఇండియాలోనే ప్రముఖ దిగ్గజ దర్శకులలో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళి తాజాగా ఢిల్లీ విమానాశ్రయం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెల్లడించడానికి ఆయన సోషల్ మీడియాను ఉపయోగించారు. “ఢిల్లీ విమానాశ్రయానికి లుఫ్తానాసా విమానంలో ఉదయం 1 గంటలకు చేరుకున్నాను. అక్కడ ఆర్టీపిసిఆర్ పరీక్ష ఫామ్ నింపడానికి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొంతమంది నిలబడి ఫామ్ ఫిల్ చేస్తుంటే, మరికొంత దానికోసం గోడలను ఆసరా చేసుకున్నారు. దరఖాస్తు ఫామ్ లను నింపడానికి టేబుల్ సిస్టం ఉంటే బాగుంటుందని…
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి అదిరిపోయే పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు మేకర్స్. సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన మొదటి అప్డేట్ కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందనే స్టేట్మెంట్ తో మరింత ఖుషీ అవుతున్నారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్, చరణ్ ఒకే బైక్పై వెళ్తోన్న ఓ ఫొటోను విడుదల చేశారు. చిరునవ్వులు చిందిస్తూ వారిద్దరు ఉన్న ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది.…
(జూన్ 23న ‘విక్రమార్కుడు’కు 15 ఏళ్ళు)పాతకథకైనా కొత్త నగిషీలు చెక్కి, జనాన్ని ఇట్టే కట్టిపడేయంలో రాజమౌళి మొనగాడు. అందులో ఏలాంటి సందేహమూ లేదు. ఆయన చిత్రాలు ఎలాఉన్నా, ఒకసారైనా చూడవచ్చునని జనమే ఏ నాడో ‘రాజముద్ర’ వేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన చిత్రం ‘విక్రమార్కుడు’. అచ్చు గుద్దినట్టుండే పోలికలతో హీరోలు డ్యుయల్ రోల్ చేయడం తెలుగు చిత్రసీమలో సదా పేయబుల్ ఎలిమెంటే! ఆ సూత్రాన్ని అనుసరించే రాజమౌళి ‘విక్రమార్కుడు’ తెరకెక్కించారు. ఆరంభంలో కొందరు మేధావులు…
బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్గా వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాదే రానుందని సినీ విశ్లేషకులు చెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై ఓ అప్డేట్ చక్కర్లు కొడుతుంది. వచ్చే ఏడాది జనవరి 26న…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఒకసారి పనిచేసిన దర్శకులు కానీ హీరోలు గానీ మళ్ళీ మళ్ళీ ఆ బ్యానర్ లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా వాళ్ళను తనవైపుకు తిప్పుకుంటారు దిల్ రాజు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడికి, దిల్ రాజుకు ఉన్న అనుబంధం కూడా గట్టిదే. వరుసగా అదే బ్యానర్ లో సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే మహేశ్ బాబుతో మూవీ…
సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించకముందే సినిమాపై రూమర్లు కూడా మొదలైపోయాయి. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంతో, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ గురించి ఆ చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. మహేష్…
ప్రముఖ దర్శకుడు, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ భారత చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ, ప్రఖ్యాత స్క్రిప్ట్ రచయితలలో ఒకరు. ప్రస్తుతం ఆయన “ఆర్ఆర్ఆర్” చిత్రానికి స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న ఆయన “ఆర్ఆర్ఆర్” గురించి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని చూశానని, అది చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అలియా భట్ పాత్ర అద్భుతంగా ఉంటుందని,…
టాలీవుడ్ చాలా సినిమాలు కరోనాతో ఇబ్బందులు పడుతున్నాయి. తొలి దశ కరోనా తర్వాత కొన్ని సినిమాలకు ఆదరణ లభించిన.. కరోనా సెకండ్ వేవ్ తో మాత్రం విడుదలకు రెడీగా వున్నా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ నెలలోనే విడుదల కావల్సిన ‘లవ్స్టోరి’, ‘టక్ జగదీష్’, ‘విరాటపర్వం’ సినిమాలు వాయిదా పడగా.. రీసెంట్ గా ఆచార్య, నారప్ప సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. సాధారణ పరిస్థితులు వచ్చాక మళ్ళీ సినిమాల జోరు కనిపించనుంది. అయితే ఎంతగానో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న…
ఇరవై ఎనిమిది సంవత్సరాల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పుట్టిన రోజు ఇవాళ! ఈ సందర్భంగా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలకు సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న బయోగ్రాఫికల్ క్రైమ్ మూవీ ‘గంగూబాయి కతియావాది’లో ఆలియా టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ యేడాది జూలై 30న విడుదల కాబోతున్న ఈ మూవీలోని ఆలియా పాత్రకు సంబంధించిన సీన్స్ తో చిన్నపాటి గ్లిమ్స్ ను చిత్ర…