కాళేశ్వరం కమిషన్ విచారణ వేళ తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని హరీష్ రావు అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేది.. కానీ, కేసీఆర్ గారి ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల…
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 61 వసంతాలు పూర్తి చేసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఈ ప్రాజెక్టు నిలుస్తోంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి.. దీనిని ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు మొత్తం 14 గేట్లను సోమవారం తెరిచారు. గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుంచి మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీటిని విడుదల చేశారు.
రాష్ట్రంలోని జలాశయాలు ఎండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో నది ప్రవాహాలు సన్నని ధారలా కూడా రావడం లేదు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఇప్పటికే నీరు అడుగు పట్టింది. కృష్ణానది పరివాహకంగా ఇప్పటికే పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే ఇప్పటికే నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి.. దీనిని ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. 48 గంటలుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టుల గేట్లు తెరచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 9 లక్షల క్యూసెక్కుల నీరు పోతుందని ఆయన అన్నారు. తెల్లారే సరికి ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నిండిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.…