శ్రీశైలం మర్యాదను కాపాడడంలో జగన్ విఫలం: రాజాసింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బీజేపీ నేతగా, గోషామహల్ నుంచి తెలంగాణ అసెంబ్లీకి తొలుత ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా ఆయనకు పేరుంది. వివాదాలు కూడా తక్కువేం కాదు. హిందూత్వానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైల మల్లిఖార్జున స్వామి దర్శనానికి వచ్చారు. ఈసందర్భంగా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో సియం జగన్ విఫలం అయ్యారన్నారు. హిందూ దేవాలయాల పరిధిలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయకూడదని వైఎస్సార్ హయాంలో 426 జీవో తీసుకొచ్చారు. జగన్ పాలనలో 426 జీవోను పక్కన బెట్టి ఇతర మతస్తులు వ్యాపారాలు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ హిందువులు హైకోర్టుకు వెళితే.. వేరే మతస్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. హిందువుల తరపున ప్రభుత్వం ఎందుకు అడ్వకేట్ ను నియమించలేదు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
సుప్రీంకోర్టు తాత్కాళిక ఆర్డర్ తో ముస్లింలు యథావిధిగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. శ్రీశైల దేవస్థానంలో ఇతర మతస్థులు ఉండేలా ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. జగన్ సీఎం అయ్యాక ఏపీలో హిందువులకు, ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. హిందూ ఆలయాల్లో ఇతర మతస్థులు వ్యాపారాలు చేయకూడదు. ఈ పద్ధతి పాటించకపోతే రాబోయే రోజుల్లో మత కలహాలు రేగే అవకాశం ఉంది. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!