Telangana Projects: తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులైన సింగూరు, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. దీనితో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 158 టీఎంసీల నీటిని విడుదల…