పౌరాణిక చిత్రాల రూపకల్పనలో తెలుగువారిదే పైచేయి. అంతకు ముందు, ఆ తరువాత ఎందరు పౌరాణిక చిత్రాలు తీసి విజయాలు సాధించినా, పురాణగాథలతో తెరకెక్కిన తెలుగువారి చిత్రాల ముందు వెలవెల బోయాయనే చెప్పాలి. ఇక మన తెలుగు చిత్రసీమ పౌరాణిక చిత్రాలలో నిస్సందేహంగా ‘శ్రీలలితా శివజ్యోతి’ వారి పంచవర్ణ చిత్రం ‘లవకుశ’ అగ్రస్థానంలో నిలుస్తుంది. తెలుగువారి తొలి రంగుల చిత్రంగా రూపొందిన ‘లవకుశ’ 1963 మార్చి 29న వెలుగు చూసింది. తెలుగునాట తొలి వజ్రోత్సవ చిత్రంగా ‘లవకుశ’ చరిత్ర…