శ్రీలంకలో నిరసనకారులను అణిచివేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ప్రజా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిపైనా, హాని కలిగించే వారిపైనా కాల్పులు జరిపేందుకు భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఎలాంటి వారెంట్లు లేకుండా అరెస్ట్ చేసేందుకు అనుమతినిచ్చింది. ఎమర్జెన్సీ గుప్పిట్లో కొనసాగుతున్న శ్రీలంకలో సైన్యానికి, పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పించారు. ఆందోళనకారులు హింసాత్మక సంఘటనలకు పాల్పడడం పట్ల శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభంతో మండిపడుతున్న ప్రజలు……