సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకం మూడో ఏడాది నిధులను సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో వర్చువల్‌గా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రతి ఏడాది రూ.15వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ సాయాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదును జమచేస్తోంది. ఒకటి నుంచి…