Ban on Diwali Celebrations: దీపావళి ఈ పేరు వింటేనే అంతా కోలాహలంగా ఉంటుంది. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా సందడిగా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ, ఓ గ్రామం మాత్రం తరతరాలుగా దీపావళి వేడుకలకు దూరంగా ఉంటోంది. అసలు… దీని వెనుక కారణం ఏంటి? పండుగకు వాళ్లు ఎందుకు దూరంగా ఉంటున్నారు? దేశవ్యాప్తంగా జరుపుకునే విధంగానే శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పండగను ఘనంగా జరుపుకుంటారు. ఏ పండగా పేరుతో గార మండలంలో ఓ గ్రామం కూడా ఉంది. దీపావళి సమయంలో పూర్వకాలంలో అస్వస్థతకు గురైన ఓ రాజుకు సపర్యలు చేయడంతో రాజ్యంలో వెలుగులు నింపారట. ఆ గ్రామానికి దీపావళిగా పేరుపెట్టుకున్నారు. ఈ పండగను ఈ ప్రాంత వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇదే సమయంలో.. ఓ గ్రామం మాత్రం దీపావళికి దూరంగా ఉంటుంది..
Read Also: Plane Crash: హాంకాంగ్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి.!
శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతో ఓ గ్రామం ఉంటే.. పండుగకు దూరంగా మరో ఊరు ఉంది.. అదే రణస్థలం మండలంలోని పున్నానపాలెం. దీపావళి వేడులకు ఆ గ్రామం 200 ఏళ్లుగా దూరంగా ఉంటోంది. గతంలో అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో ఆ ఊరిలో దీపావళి రోజు చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో నాటి నుంచి నేటి వరకు అక్కడి ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకోవడం లేదు. పూర్వకాలంలో పాము ఓ ఇంట్లోకి వచ్చి ఊయలలో నిద్రిస్తున్న చిన్నారిని కాటేసిందట. ఆ చిన్నారి చనిపోయింది. అదే రోజు ఊరులో ఓ రైతుకు చెందిన రెండు ఎద్దులు కూడా మరణించాయట. ఈ విషాద ఘటనలు గ్రామస్థులను తీవ్రంగా కలిచివేశాయి. నాటి నుంచి తమ ఊరిలో దీపావళి పండుగ జరుపుకోవద్దని పెద్దలు తీర్మానించారట. పున్ననపాలెం గ్రామస్థులు ఇప్పటికీ ఆ కట్టుబాటును గౌరవిస్తూ పండుగ జరుపుకోవడం లేదు. మొత్తానికి.. దీపావళిని జరుపుకోని గ్రామాలు కూడా ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. తమ పూర్వీకులు చేసిన తీర్మానాన్ని ఇప్పటికీ పాటిస్తూ.. ఆ గ్రామం దీపావళికి దూరంగా ఉంటూ వస్తుంది.. గతంలో జరిగిన ఈ విషాద ఘటనలు మళ్లీ తమ గ్రామంలో జరగకూడదు అంటే.. దీపావళికి దూరంగా ఉండడమే సరైనది అనే కట్టుబాట్లకు వచ్చారు ఆ గ్రామస్థులు.