ప్రస్తుతం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’పైనే సినీ అభిమానుల్లో చర్చ సాగుతోంది. దాదాపు 36 ఏళ్ళ తరువాత వచ్చిన అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇదే కావడంతో ఆ చర్చ మరింతగా మురిపిస్తోంది. ఈ మధ్య వచ్చిన మల్టీస్టారర్స్ లో ఓ సీనియర్ స్టార్ తో తరువాతి తరం స్టార్ హీరో నటించారు తప్ప, సమకాలికులు, సమ ఉజ్జీలయిన స్టార్స్ కలసి నటించలేదు. అది రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’తోనే సాధ్యమైంది. ఇందులో నవతరం అగ్రకథానాయకులైన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్…
అతిలోక సుందరి శ్రీదేవి మనల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లి మరో సంవత్సరం పూర్తి అయ్యింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి అకాల మరణం లక్షలాది మంది అభిమానుల హృదయాలను కలచి వేసింది. శ్రీదేవి కన్నుమూసి నాలుగేళ్లు అవుతున్న తరుణంలో దివంగత నటికి హృదయపూర్వక నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా ఆమె మరణ వార్షికోత్సవం సందర్భంగా తన తల్లిని గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది.…
హీరో కృష్ణ, డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి కాంబినేషన్ లో పలు జనరంజకమైన చిత్రాలు తెరకెక్కాయి. వారిద్దరి కలయికలో రూపొందిన పల్లెసీమల నేపథ్యం ఉన్న సినిమాలు విజయాలు సాధించాయి. కృష్ణను సంక్రాంతి హీరోగా నిలిపిన ఘనత కూడా చంద్రశేఖర్ రెడ్డిదే! కృష్ణ హీరోగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘పాడిపంటలు’ చిత్రం విజయం సాధించింది. అప్పటి నుంచీ ప్రతి సంక్రాంతికి కృష్ణ ఓ సినిమాను విడుదల చేస్తూ వచ్చారు. అలా కృష్ణ, పి.సి.రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన ‘బంగారుభూమి’ కూడా…
ఒకప్పుడు హిందీ రీమేక్స్ కు తెలుగులో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా నటరత్న నందమూరి తారక రామారావుదే! ఆయన నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు ఆకలిది” వంటి హిందీ రీమేక్స్ బాక్సాఫీస్ బరిలో జయకేతనం ఎగురవేశాయి. వాటి సరసన చేరిన చిత్రం యన్టీఆర్ నిర్మించి, నటించిన ‘అనురాగదేవత’. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషా’ ఆధారంగా ‘అనురాగదేవత’ రూపొందింది. 1982 జనవరి 9న సంక్రాంతి కానుకగా ‘అనురాగదేవత’ జనం…
ఒకే రోజున విడుదలైన రెండు చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అజయ్ దేవగణ్ తొలి చిత్రం ‘ఫూల్ ఔర్ కాంటే’ విడుదలైన రోజునే శ్రీదేవి, అనిల్ కపూర్ నటించిన రొమాంటిక్ మూవీ ‘లమ్హే’ విడుదలయింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 1991 నవంబర్ 22న విడుదలైన ‘లమ్హే’ నటిగా శ్రీదేవికి ఎనలేని పేరు సంపాదించి పెట్టింది. యశ్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి కూడా…
(అక్టోబర్ 9తో ‘క్షణ క్షణం’కు 30 ఏళ్ళు)తొలి చిత్రం ‘శివ’తోనే దర్శకునిగా తానేమిటో నిరూపించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆ పై రెండో సినిమాగా హిందీలో ‘శివ’ను రీమేక్ చేశారు. ఆ సినిమాకు అంతకు ముందు హిందీలో వచ్చిన సన్నీ డియోల్ ‘అర్జున్’కు పోలికలు ఉన్నా, రామ్ గోపాల్ వర్మ టేకింగ్ ను బాలీవుడ్ జనం సైతం మెచ్చారు. అలా ఆల్ ఇండియాలో పేరు సంపాదించిన రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రెండవ తెలుగు చిత్రం ‘క్షణ…
(అక్టోబర్ 2న ‘ఒకరాధ – ఇద్దరు కృష్ణులు’కు 35 ఏళ్ళు) ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవలలను పలుమార్లు సినిమాలుగా రూపొందించి విజయం సాధించారు దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి. ఈ నేపథ్యంలో యండమూరి రాసిన ‘ఒకరాధ ఇద్దరు కృష్ణులు’ నవలను అదే టైటిల్ తో రూపొందించారు. శ్రీసారసా మూవీస్ పతాకంపై తెరకెక్కిన ‘ఒక రాధ – ఇద్దరు కృష్ణులు’లో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించారు. 1986 అక్టోబర్ 2న విడుదలైన ‘ఒక రాధ – ఇద్దరు…
అతిలోక సుందరి శ్రీదేవి క్రేజ్ ఎంతో తెలుగు వారికి తెలిసిందే. అయితే, తెలుగు, తమిళంలోనే కాదు ఆమె హవా హిందీ తెరపై కూడా ఓ రేంజ్లో ఉండేది. తనతో నటించేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడేవారు. జీతేంద్ర, అమితాబ్ లాంటి సీనియర్ హీరోలే కాదు సల్మాన్, షారుఖ్ లాంటి 1990ల కాలపు యువ హీరోలు కూడా శ్రీతో జోడీ కట్టారు. కానీ, కేవలం ఆమీర్ ఖాన్ మాత్రం ఆమెతో ఒక్క సినిమా కూడా చేయలేదు! ఆమీర్ ఖాన్,…
అందాల అభినేత్రిగా జనం మదిలో నిలచిపోయిన శ్రీదేవి అంటే ఇప్పటికీ అభిమానులకు ఓ ఆనందం, ఓ అద్భుతం, ఓ అపురూపం. శ్రీదేవికి మాత్రమే ఎందుకంత ప్రత్యేకత! ఆమెలాగే బాల్యంలోనే నటించి, తరువాత కూడా నాయికలుగా రాణించిన వారు ఎందరో ఉన్నారు. అయినా, శ్రీదేవి ఓ స్పెషల్!? నిజమే, శ్రీదేవిలాగే బాలనటిగానూ, తరువాత నాయికలుగానూ మురిపించిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఎవరి సరసనైతే తాను మనవరాలుగా, కూతురుగా, చెల్లెలుగా నటించిందో సదరు హీరోలతోనే నాయికగానూ శ్రీదేవి మురిపించడం…