Sridevi death anniversary : జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతిలోక సుందరి శ్రీదేవి మనల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లి మరో సంవత్సరం పూర్తి అయ్యింది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి అకాల మరణం లక్షలాది మంది అభిమానుల హృదయాలను కలచి వేసింది. శ్రీదేవి కన్నుమూసి నాలుగేళ్లు అవుతున్న తరుణంలో దివంగత నటికి హృదయపూర్వక నివాళులర్పిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కూడా ఆమె మరణ వార్షికోత్సవం సందర్భంగా తన తల్లిని గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది.
Read Also : Bheemla Nayak Event : త్రివిక్రమ్ సైలెన్స్… ఆయన కోసమేనా?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
జాన్వీ తల్లితో తన చిన్ననాటి ఫోటోను పంచుకుంది. ఆ అందమైన ఫొటోకు ఇచ్చిన క్యాప్షన్‌లో జాన్వీ తన జీవితంలో తల్లి ఉనికిని ఎంతగా కోల్పోతుందో చెప్పుకొచ్చింది. “నేను ఇప్పటికే నా జీవితంలో మీరు లేకుండా ఎక్కువ సంవత్సరాలు జీవించాను. కానీ మీరు లేని జీవితానికి మరొక సంవత్సరం యాడ్ అవ్వడాన్ని నేను ద్వేషిస్తున్నాను. మేము మిమ్మల్ని గర్వపడేలా చేస్తామని ఆశిస్తున్నాను అమ్మా… ఎందుకంటే అది ఒక్కటే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తాను” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అంతకుముందు జాన్వీ సోదరి ఖుషీ కపూర్ కూడా తన తల్లి నాల్గవ వర్ధంతి సందర్భంగా శ్రీదేవిని తలచుకుంటూ ఆమెతో ఉన్న పాత ఫోటోను పంచుకున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?