Aggressive Elephant: కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరుర్ పట్టణంలోని పుతియంగడి ఆలయ ఉత్సవం సందర్భంగా ఒక ఏనుగు విరుచుకుపడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఐదు ఏనుగులు ఈ వేడుకలో పాల్గొన్నాయి. అయితే, ఇందులో పక్కాతు శ్రీకుట్టన్ అనే ఏనుగు ఒక్కసారిగా దూకుడుగా ప్రజలపై ఆగ్రహం చూపించింది. ఈ ఏనుగు తొండంతో ఓ వ్యక్తిని పైకి ఎత్తి పడేయడంతో అతడు పది అడుగుల దూరంలో పడ్డాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ గాయపడిన వ్యక్తిని…