వైసీపీపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు సోమిరెడ్డి. టీడీపీ నేతలు.. కొందరు అధికారుల ఫోన్లను వైసీపీ ట్యాప్ చేస్తుందని మా అనుమానం. ప్రభుత్వ పరంగా కాకుండా.. వైసీపీ పార్టీ పరంగా ఓ సాఫ్ట్ వేర్ ద్వారా ట్యాపింగుకు పాల్పడుతున్నారని మేం నమ్ముతున్నాం. దీనిపై గతంలోనే మా అనుమానాలు వ్యక్తం చేశాం. పెగాసెస్ స్పై వేర్ చంద్రబాబు కొనుగోలు చేశారన్నది ఓ పెద్ద బ్లండర్.…
పెగాసెస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్ విక్రయించడానికి బెంగాల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించిందని చెప్పారు. 25 కోట్లు డిమాండ్ చేశారని…
ఇజ్రాయిల్‌కు చెందిన పెగసిస్ స్పైవేర్ పార్లమెంట్‌ను కుదిపేయబోతుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఈరోజు రాజ్యసభలో కోవిడ్ పై చర్చజరగాల్సి ఉన్నది. అయితే, రాజ్యసభలో జరగాల్సిన అన్ని చర్చలను పక్కన పెట్టి పెగసిస్ స్పైవేర్ పై చర్చను జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలోని ప్రముఖులకు చెందిన ఫోన్ నెంబర్లపై నిఘా ఉంచారని ప్రపంచంలోని పలు మీడియా సంస్థలు కథనాలగా పేర్కొన్నాయి. ఇండియాకు చెందిన 300 మందిపై నిఘా ఉంచారని ఆయా మీడియాలు పేర్కొన్నాయి. Read:…
రెండేళ్ల క్రితం భారత్‌లో పెగాసస్ సంస్థ తయారు చేసిన స్పైవేర్ ఇప్పుడు భారత్‌ను భయపెడుతున్నది. ఈ స్పైవేర్‌ను నిఘా కోసం వినియోగిస్తుంటారు. క్రిమినల్స్, ఉగ్రవాదులను పట్టుకోవడానికి పలు దేశాలు ఈ స్పైవేర్‌ను వినియోగిస్తుంటాయి. ఈ స్పైవేర్ సహాయంతో హ్యకింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఐఫోన్ తమ యూజర్లకోసం ఐఓఎస్ అప్డేట్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. కాగా, ఈ స్పైవేర్ తో పాటు ఆండ్రాయిడ్ ఫోన్లను కూడా హ్యాక్‌చేసే సామర్ధ్యం ఉందని తెలియడంతో మరోసారి వెలుగులోకి వచ్చింది. 2019లో…