2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు.. సెమీ ఫైనల్ లోనే ఓటిమిని చవిచూడల్సి వచ్చింది. కానీ ఈసారి ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు ఫైనల్ కు చేరుకుంది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 5-3తో ఓడించింది. దీంతో.. భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది.
ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణాలు సహా 69 పతకాలు సాధించింది. ఆసియా క్రీడల 11వ రోజు అనగా.. అక్టోబర్ 4న భారత్ ఆశలు పెట్టుకున్న బల్లెం వీరుడు నీరజ్ చోప్రా స్వర్ణం కోసం పోటీ పడనున్నాడు.
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటి వరకు ఇండియా 60 పతకాలు సాధించింది. అందులో 13 బంగారు పతకాలతో పాటు 24 రజత పతకాలు, 23 కాంస్య పతకాలను భారత క్రీడాకారులు గెలిచారు. అయితే పతకాల పట్టికలో మాత్రం భారత్ నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. అంతేకాకుండా ఈరోజు మొత్తం 7 పతకాలను కైవసం చేసుకుంది.
ఆదివారం జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ విజృంభించింది. ఇవాళ ఒకే రోజు 15 పతకాలు సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో చరిత్రలో తొలిసారిగా భారత ఆటగాళ్లు భారీ రికార్డు సృష్టించారు.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. చైనాతో జరిగిన స్వర్ణ పతక పోరులో భారత్ ఓటమి పాలైంది.
ఆసియా క్రీడల్లో భారత్ పసిడి పంట పండిస్తుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు గోల్డ్ మెడల్స్ చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, షాట్‌ఫుట్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి.
భారత బాక్సర్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్లో ఓడిపోయింది. బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. 50 కేజీల విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నిఖత్ జరీన్ థాయ్‌లాండ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత వెటరన్ నిఖత్ జరీన్ 2-3 తేడాతో ఓటమి పాలైంది.
ICC వరల్డ్ కప్ 2023కి ముందు స్టార్ పాకిస్థాన్ ఆల్-రౌండర్ షాదాబ్ ఖాన్ తన పేలవమైన ఫామ్‌ను అంగీకరించాడు. షాదాబ్ ఖాన్ తన అధ్వాన్నమైన బౌలింగ్ ప్రదర్శనలు అతని మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని చెప్పాడు. షాదాబ్ ఖాన్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ రానించగల సత్తా ఉంది. అయితే ఈ ఆల్ రౌండర్ 2023 ఆసియా కప్‌లో 4.33 సగటుతో 13 పరుగులు మాత్రమే చేశాడు. 40.83 సగటుతో కేవలం ఆరు వికెట్లు తీశాడు.
న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ లో ఓటమి చెందిన తర్వాత పాక్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. జట్టు ఓటమిపై పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు.