ENG vs SL: వరల్డ్ కప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టును శ్రీలంక 33.2 ఓవర్లలో 156 పరుగులకే పరిమితం చేసింది. శ్రీలంక బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆంగ్ల జట్టును 156 పరుగులకే కట్టడి చేశారు. శ్రీలంక బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ కుప్పకూలిపోయింది. ప్రపంచకప్‌లో లంకేయులపై ఇంగ్లండ్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
Also Read: Babar Azam Captaincy: బాబర్ ఆజం కెప్టెన్సీ ఊడుతుందా?.. పాక్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన
ఇంగ్లీష్ ఓపెనర్లు నిలకడగా రాణించినప్పటికీ, వారిద్దరూ తమ ప్రారంభాలను పెద్ద స్కోర్లుగా మార్చడంలో విఫలమయ్యారు. జో రూట్ పెద్దగా ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. అలాగే జోస్ బట్లర్ పేలవమైన ఫామ్ కొనసాగుతుండగా.. జానీ బెయిర్‌స్టో రనౌట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ 43 పరుగులతో వారి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అయితే అవతలి వైపు నుంచి బ్యాటర్ల మద్దతు లేకపోవడంతో అతను కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. చివరికి డిఫెండింగ్ ఛాంపియన్‌లు 156 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
మరోవైపు శ్రీలంక బంతితో అద్భుతంగా రాణించింది. కుసాల్ మెండిస్ బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకున్నాడు. ఈ గేమ్ కోసం వారు చేసిన మార్పులు ఫలవంతంగా మారాయి. బౌలర్లలో లహిరు కుమార మూడు వికెట్లు పడగొట్టగా, ఏంజెలో మాథ్యూస్ రెండు వికెట్లను పడగొట్టాడు. కసున్ రజిత కూడా రెండు వికెట్లను తీయగా.. మహీశ్ తీక్షణ ఆఖరి వికెట్‌తో పని ముగించాడు.