టీమిండియా ఆడిన తొలి మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆడలేదు. కారణం అతను డెంగ్యూ బారిన పడ్డాడు. ఇక రేపు టీమిండియా ఆఫ్ఘనిస్థాన్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా శుభ్‌మన్ గిల్ ఆడటంలేదని బీసీసీఐ తెలిపింది.
ఇద్దరు క్రికెటర్లపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నిషేధం వేటు వేసింది. అండర్-19 క్రికెటర్ మహ్మద్ బాబిల్లేల్, రిజిస్టర్డ్ ఆటగాడు శశాంక్ మెహ్రోత్రాలను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీమ్ సెలక్షన్ లో తప్పుడు పత్రాలు(నకిలీ వయస్సు సర్టిఫికెట్స్) ఇచ్చినట్లు హెచ్‌సీఏ నిర్ధారించింది.
మొన్నటికి మొన్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు మార్క్రామ్ చెలరేగి ఆడాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డులకెక్కాడు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ ఫ్రేజర్ మెక్ గుర్క్ కూడా అరుదైన ఘనత సాధించాడు. 29 బంతుల్లో సెంచరీ చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
2023 వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అందులో భాగంగా ఈనెల 5 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇంత పెద్ద ఈవెంట్ లో మొదటి మ్యాచ్ చూడటానికి క్రికెట్ అభిమానులు ఎక్కువగా హాజరుకాలేదు.
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 199 పరుగులకే ఆలౌటైంది.
2023 వన్డే ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ప్రారంభించింది. ఢిల్లీలో జరిగిన సౌతాఫ్రికా-శ్రీలంక మధ్య మ్యాచ్ లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 102 పరుగుల తేడాతో భారీ గెలుపును నమోదు చేసింది. మొదటగా బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపటి మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించారు. అతను చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో తమ దేశంలో కంటే భారతదేశంలో ఎక్కువ వైట్ బాల్ క్రికెట్ ఆడామని, దాని వల్ల ఇక్కడి పిచ్ పరిస్థితులు తనకు బాగా తెలుసన్నారు.
వన్డే వరల్డ్ కప్ లో ఆతిథ్య భారత్ రేపు(ఆదివారం) ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలిసారి వరల్డ్ కప్ భారత్ నిర్వహిస్తుండటంతో.. ఎలాగైనా కప్ ను సొంతం చేసుకోవాలనే ఆశతో ఉన్నారు టీమిండియా. మరోవైపు రేపటి మ్యాచ్ లో కొందరు ఆటగాళ్లు ఆటడంలేదు. దీంతో ప్లేయింగ్ ఎలెవన్ లో ముగ్గురు స్పిన్నర్లను చేర్చుకునే అవకాశం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
ఆసియా క్రీడల్లో భారత్ ప్రచారం ముగిసింది. ఆసియా క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. 2023 ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు 107 పతకాలు సాధించారు. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత్ 100 పతకాల మార్కును దాటింది. అందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఆసియా క్రీడలు 2023 టోర్నీలో భారత్ హవా కొనసాగిస్తుంది. ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత పురుషుల కబడ్డీ జట్టు స్వర్ణం గెలిచింది. తీవ్ర ఉత్కంఠ నడుమ 33-29 పాయింట్ల తేడాతో పసడి సాధించారు.