DC vs RR: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా ఢిల్లీ, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ జట్టు బ్యాటింగ్‌తో బరిలోకి దిగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. దాంతో, నేడు రాజస్థాన్ తో మ్యాచ్ ఢిల్లీ జట్టుకు కీలకంగా మారింది. అటు, రాజస్థాన్ జట్టు విజయంతో టోర్నీలో శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్… లక్నో సూపర్ జెయింట్స్ పై నెగ్గింది. ఇవాళ ఢిల్లీ జట్టుపైనా గెలిచి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని రాజస్థాన్ భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ వెల్లడించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రిషబ్ పంత్(w/c), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (w/c), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్