దేశ క్రీడా రంగానికి దిక్సూచిగా… ఒలింపిక్స్ పతకాల వేటకు ఆట మైదానంగా…. భావి క్రీడాకారులకు మార్గదర్శిగా… ఘనమైన గత వారసత్వపు పరిమళాలను మరింతగా వ్యాపింపజేసేందుకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. ప్రతి క్రీడాకారునిలో ప్రతిభకు మరింతగా సానబెట్టి విశ్వ వేదికపై మన క్రీడాకారులు దేశ పతాకాన్ని గర్వంగా ఎగురవేసేందుకు వీలుగా వారికి అవసరమైన వసతులు, ప్రోత్సాహాకాలు కల్పించేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం క్రీడా విధానాన్ని (స్పోర్ట్స్ పాలసీ) రూపొందించింది. ప్రముఖ క్రీడాకారుల సమక్షంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలంగాణ…
Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఏ చర్యలు తీసుకోవాలనే దానిపై సుదీర్ఘ చర్చ సాగనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు అధికారులు, మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీ…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
జగిత్యాల జిల్లా నుంచి మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యారంగం పట్ల సరైన దృష్టి ఇవ్వలేదని, విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆమె పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు, విద్యా రంగాన్ని పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనున్నది. ముఖ్యంగా, 1982 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోబడే అవకాశం ఉంది.
CM Revanth Reddy: ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి సీరేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.