CM Revanth Reddy: 2036 ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకుని పాలసీ సిద్ధం చేయాలి..
- ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..
- హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన స్టేడియాలను ఒకే హబ్‌గా తీర్చిదిద్దాలి..
- స్కిల్ యూనివర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలి..
- 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో పెట్టుకుని పాలసీ సిద్ధం చేయాలి- సీఎం రేవంత్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి సీరేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యంగ్ ఇండియా అకాడమీ ఏర్పాటుతో పాటు హైదరాబాద్ లో ఉన్న అన్ని ప్రధాన స్టేడియాలను ఒకే హబ్ గా తీర్చిదిద్దాలి అని సూచించారు. ఇక, స్కిల్ యూనివర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. క్రీడల్లో పతకాలు సాధించే క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాల పైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని పాలసీ సిద్ధం చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Deputy CM Pawan Kalyan: సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన పవన్.. కీలక వ్యాఖ్యలు
Also Read
ఆ తర్వాత, పేద ప్రజల హృదయాలలో దీపమై వెలిగిన మహనీయుడు కాకా (జి. వెంకటస్వామి) అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జి.వెంకటస్వామి జయంతి (05-10-2024) సందర్బంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా కేంద్రమంత్రిగా, సేవలందించారని.. సింగరేణి కార్మికుల జీవితాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని.. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేసారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే, తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో కాకా అలు పెరుగని పోరాటం చేసారని.. 1969లో తెలంగాణ కోసం జైలు కెళ్లాడని అన్నారు. ఆయన జీవితం కార్మికులు, పేదలతోనే మమేకమైందని.. నిలువ నీడ లేని నిరుపేదలకు గూడు కల్పించాలని గుడిసెల పోరాటం చేసి.. కొన్ని వేల గుడిసెలు పేద లకోసం వేయించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
తాజావార్తలు
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!